ఉద్యోగాల కోసం మగ్గిపోతున్న విద్యార్థుల ఆవేదన

ఉద్యోగాల కోసం మగ్గిపోతున్న విద్యార్థుల ఆవేదన

Fri, 18/05/2018 - 07:56
0 comments
చదువుల కోసం వయసును వమ్ము చేసుకున్నాం ఉద్యోగాల కోసం వర్తమానాన్ని ధారపోశాం అదిప్పుడు.. భూతకాలమయ్యింది జ్ఞాపకాల్లేని గతమైపోయింది వెనుదిరిగి చూద్దామంటే అగాధంలా.. అంతులేని శూన్యంలా.. భయపెడుతోంది భవిష్యత్తునే సవాల్ చేస్తోంది ఇప్పుడు మేమంతా ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా నిలుచున్నాం ఆధారం లేని గాలిపటంలా వేలాడుతున్నాం ఏం చెప్పమంటారు మా బాధలు .. పెళ్లి లేదు.. పేరంటం లేదు ఇల్లు లేదు.. ఇంటికెళ్లే దారీ లేదు అయిన వాళ్లందరికీ దూరంగా అమ్మా నాన్నలకు భారంగా కాలం వెల్లదీస్తున్నాం..! పిల్లలనెత్తుకోవాల్సిన వయసులో పుస్తకాలను మోస్తున్నాం పస్తులుంటూ గడుపుతున్నాం సంపాదించాల్సిన సమయంలో సాయం కోసం చూస్తున్నాం పదికీ వందకీ పాట్లు పడుతున్నాం..! ఒకవైపు వయసు దాడి మరోవైపు మనసుతో ఓడి ఎవరికి వారే ఒంటరై పోతున్నాం వద్దంటే వస్తున్న బట్ట వెక్కిరిస్తున్న పొట్ట నడి వయస్కుల్లా నిందిస్తున్నాయి ఎన్నని చెప్పమంటారు మా కష్టాలు..! కూలోనాలో చేసుకుంటున్న స్నేహితులు కులాసాగా గడిపేస్తున్నారు వ్యవసాయమో వ్యాపారమో చేస్తున్నోళ్లు వడ్డీలిచ్చే స్థాయికి ఎదిగి పోయారు కానీ చదువును నమ్ముకున్న మేము అందరికీ చులకనై పోయాం ఎన్ని అవమానాలు భరించమంటారు నిన్నా మొన్నటి నీసరోడి నుంచి మూలుగ లేని ముసలోడి వరకు పైసాకు పనికిరానోడి నుంచి పచ్చి పోరంబోకు వరకు ఇంకెన్నాళ్లురా చదువు అన్నపుడు.. చెవుల్లో సీసం పోసినట్లుంటుందనీ ఎవరికి చెప్పుకోమంటారు నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూసి చూసి కళ్లు కాయలు కాస్తున్నా, అప్పుడో ఇప్పుడో వస్తదిలే అని మనసుకి సర్ది చెప్పుకుంటు బాదని బరిస్తూ కాలాన్ని ఎల్లదీస్తూ కనిపించని శత్రువుతో యుద్దం చేస్తూ, పుస్తకాలతో సహవాసం చేస్తూన్నాము (ఉద్యోగాల కోసం మగ్గిపోతున్న విద్యార్థుల ఆవేదన )
English