తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్లు చేసే అధికారం

తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్లు చేసే అధికారం

Sun, 06/05/2018 - 14:50
0 comments
*TELANGANA* 🔊 *తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్లు చేసే అధికారం..! 🌎📚 *రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలను సులభతరం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన మార్పుల్లో భాగంగా తహసీల్దార్లకు సబ్‌రిజిస్ట్రార్‌ బాధ్యతలు అప్పగించేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు విడుదల కానున్నాయి. ది ఇండియన్‌ స్టాంప్స్‌ యాక్ట్‌-1899, ది రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌-1908 ప్రకారం తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించిన అధికారాలను త్వరలో అప్పగించనున్నారు. మరోవైపు భూమి హక్కుల చట్టం ప్రకారం భూముల మ్యుటేషన్‌ అధికారాలు కూడా తహసీల్దార్లు నిర్వర్తించనున్నారు. రిజిస్ట్రేషన్ల సేవల విషయంలో తహసీల్దార్లపై రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులకు పర్యవేక్షణ అధికారాలను అప్పగించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఈ నెల 19నుంచి కొన్ని మండలాల్లో ప్రయోగాత్మకంగా తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు కట్టబెట్టనున్నారు.