అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు

ఆది, 13/05/2018 - 18:06
0 comments

అమ్మా నన్ను కన్నందుకు
విప్లవాభివందనాలు

పొలాల్లో పరిగె గింజ
ఏరుకొనే వేళలందు
పక్షుల రాగాల నడుమ
గరిక పూల పాన్పుమీద
అమ్మ నన్ను కన్నుందుకు
విప్లవాభివందనాలు

రాలిపడిన పూవులకై
గాయపడిన పిట్టలకై
ప్రాణమివ్వ నేర్పినావు
ఏటికి ఎదురీదమని
ఉగ్గుపాలు పోసినావు

నెలబాలుని నీ చనుబాలుతో
పెంచి పెద్ద చేసినావు
నడిరాత్రి పత్తికాయ పలిగిన
ధ్వని వినిపించావు
అమ్మా నన్ను కన్నందుకు
విప్లవాభివందనాలు..
★★★
"మాతృ దినోత్సవం"
సందర్భంగా
సామాజిక విప్లవ కవి 
భారత బహుజన విప్లవ కమ్యూనిస్టు యోధుడు "శివసాగర్"
 కలం నుండి జాలువారిన 
అమ్మా పై అయిన రాసిన కవిత్వం    అక్షర దండియాత్ర✍