కార్మిక హక్కులు లేని రోజుల్లోని దుర్భర పరిస్థితులు: ఏంజెల్స్ మాటల్లో

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

కార్మిక హక్కులు లేని రోజుల్లోని దుర్భర పరిస్థితులు: ఏంజెల్స్ మాటల్లో

మంగళ, 01/05/2018 - 15:55
1 comment
మేడే ఉద్యమం ద్వారా 8గంటలు పనిచేసే విధానం, కార్మిక హక్కులు లేని రోజుల్లో ఎంత దౌర్భాగ్యం గా ఉండేది తెలియాలంటే ఏంగెల్స్ రాసిన ఈ పరిశీలన నుంచి కొన్ని లైన్లు .....( తెలుగు లో) *ఇంత దారుణమైన పరిస్థితులుండేవని మీకు తెలుసా?* *గుట్టల కొద్దీ ఎముకలు పోగుబడి దుర్గంధం వెదజల్లుతున్న శ్మశాన వాటికలో,ప్రతిబుధవారం ఫాదర్ ఎంతవేగంగా మంత్రాలు చదువుతాడో అంతే వేగంగా 14 అడుగుల లోతైన గుంటలోకి దరిద్రుల శవాలను విసిరేసే వారనీ* ,4,5,7 సం.ల వయసుల్లోని పిల్లలు బొగ్గు ,ఇనుపగనుల్లో పన్నెండు గంటలపాటు పనిచేసి రాత్రి ఇంటికొచ్చే దారిలో రోడ్డు పక్కన నిద్రపోతే తల్లిదండ్రులు వెతికి మోసుకొచ్చేవారనీ,ఉదయం 5 గంటలనుంచి రాత్రి 9 గంటలవరకూ మిల్లులో పనిచేసే తల్లులు తమ పసిపిల్లలు కదలకుండా పడి ఉండటానికి మత్తుమందులిచ్చేవారనీ ,పేదల వసతి గృహంలో నిద్రపట్టని రోగులు తనకు నిద్రాభంగం కలిగిస్తారేమో అనే అనుమానంతో వాళ్ళను మంచానికేసి కట్టేసే నర్సులుండేవారనీ ఎవరైనా చెబితే కట్టుకథలని కొట్టిపారేస్తాం.కానీ ఆ *చెప్పింది 24 ఏళ్ల వయసున్న యువకుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్."ది కండిషన్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్ ఇన్ ఇంగ్లండ్" అనే పుస్తకం లో* *తండ్రి ఓ పెట్టుబడిదారుడు కాబట్టి కొడుకుని తమ పరిశ్రమశాఖలో పనిచేయమని ఇంగ్లండు పంపిస్తే ఎంగెల్స్ ఆ పని మానేసి,తన వయసు వాళ్లంతా జల్సాలతో విలాసాలతో గడుపుతుంటే తనుమాత్రం 21 నెలలపాటు గనులూ ,పట్టుపరిశ్రమా ,లోహపరిశ్రమా ,మటిపాత్రల పరిశ్రమా గాజుపరిశ్రమా,ఫ్యాషన్ పరిశ్రమలను పరిశీలిస్తూ తిరిగాడు.కార్మికవాడల్లో ప్రజల బతుకులు చూసి,వారిఇళ్లలో గడిపి,పత్రికలూ ప్రభుత్వరిపోర్టుల ద్వారా సమాచారం సేకరించి ఈపుస్తకం రాశాడు* *చదువుతుంటే ఇంత అణచివేతల్ని ఆ కార్మికులెలా భరించారో అని ఆశ్చర్యపోతాం.తక్కువ ఎత్తులో ఉన్న బొగ్గుగని సొరంగాల్లో కార్మికులు 11 నుంచి 12 గంటలపాటు మోచేతులు ఆసరాగా చేసుకుని బొగ్గు తవ్వేవారు.రకరకాల రోగాలతో నలభై యాభై ఏళ్లకే పనికిరాకుండా పోయేవారు.స్త్రీలూ ,పిల్లలూ తమ నడుములకు గొలుసులతో కట్టిన బొగ్గు తొట్లను పాక్కుంటూ ఆ సొరంగాల్లోంచి ఈడ్చుకొచ్చేవారు.లండన్ లో 50 వేలమంది తలదాచుకునే చోటులేక పడకలు అద్దెకిచ్చే లాడ్జింగు కెళ్ళేవారు.అక్కడ రోగులూ,ముసలీ ముతకా ఆడా మగా అనే విచక్షణ లేకుండా వచ్చినవారిని వచ్చినట్టే ఒకో పక్కమీద ఆరుగురి చొప్పున పడుకోమనేవారు.(జరిగే నీచత్వాన్ని మనం ఊహించవచ్చు )* *పిల్లల పరిస్థితి మరీ ఘోరం .ఫ్యాక్టరీలలో పిల్లల తో 14 నుంచి 16 గంటలసేపు పనిచేయించేవారు.సూపర్ వైజర్లు ఫ్యాక్టరీ బయట నిద్రిస్తున్న పిల్లలను తన్నులతో గుద్దులతో ఫ్యాక్టరీలోకి తరిమేవారు .ఓ కుర్రాడు పారిపోతే ఉత్పత్తి దారుడు అతన్ని గుర్రం ఫై వెంటాడి పట్టుకుని దారిపొడుగునా కొరడాతో బాదుతూ తనగుర్రంతో సమానంగా పరుగెత్తించాడు*. *ట్రెడ్ మిల్ శిక్ష:* ఉత్తర ఇంగ్లండులో సంవత్సరం పాటు పనిచేయాలనే ఒప్పందం మీద కార్మికుల్ని నియమించుకునేవారు.పనిలేని రోజుల్లో వేతనం ఇవ్వరు.అలా అని ఆ ఖాళీ కాలంలో ఎక్కడైనా పనిలో చేరితే ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఆ కార్మికుడికి ఆరు వారాలపాటు తొక్కుడు యంత్రం ( ట్రెడ్ మిల్ ) శిక్ష విధించేవారు. *కార్మికవర్గ చరిత్ర అన్నప్పుడు ఇంగ్లండునే ఎందుకుతీసుకోవాలంటే 18 వ శతాబ్దం చివర ఆవిరియంత్రాలూ నూలుయంత్రాలూ కనుక్కోవడంతో కార్మికవర్గం మొట్టమొదట ఆవిర్భవించింది ఇంగ్లండు భూభాగం పైనే కాబట్టి* *ఈ పుస్తకం "ఇంగ్లండు లో కార్మికవర్గ చరిత్ర " అనే పేరుతొ తెలుగులో రావడం మొదటిగా 2010 లోనే జరిగింది .అనువాదం రావు కృష్ణారావు గారు.రంగనాయకమ్మ గారు దీనికి ముందు మాట రాస్తూ " రావు కృష్ణారావుగారు అలవోకగా సులువుగా తెలుగు చెయ్యగలిగారు.ఇంత పెద్దపుస్తకం చెయ్యడానికి ఆయనకి 5 నెలలు కూడా పట్టలేదు.ఎంగెల్స్ మీద ప్రేమవల్లా కార్మికవర్గం మీద ప్రేమ వల్లా జరిగుంటుంది " అన్నారు* *ఏనాడో జరిగిన చరిత్ర ఇప్పుడెందుకు ? అనుకోకూడదు.కార్మికప్రజలకు తమ పాతచరిత్రంతా తెలియాలి.కాబట్టి తప్పకుండా దీన్ని చదవాలి*. *అంతర్జాతీయ కార్మిక దినోత్సవం " మేడే " సందర్భంగా*

Comments