కష్టాల కొలిమిలో కాలిపోతున్న హృదయాలకు ఓదార్పు కావాలి

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

కష్టాల కొలిమిలో కాలిపోతున్న హృదయాలకు ఓదార్పు కావాలి

గురు, 10/05/2018 - 08:06
0 comments

కవిత్వం
***
కవిత్వమంటే..
 కష్టాల కొలిమిలో కాలిపోతున్న హృదయాలకు
ఓదార్పు కావాలి 

కవిత్వమంటే.... 
 నిరాశ నిస్పృహ బ్రతుకులను 
నిలువెల్లా చైతన్య పర్చే కాగడై వెలుగునిచ్చే
మార్గం కావాలి

కవిత్వమంటే నిత్యం బ్రతుకుయుద్ధంలో
విజేతగా నిలవాలి
కవి మానవ సామాజిక జీవితంలో సరిహద్దులో
ఓ సైనికుడే...

రాబోయే కాలానికి కవి కథా నాయకుడై
నిలవాలి 
ఓ మాక్సింగోర్కీ లాగా..
★★★**
అక్షర దండియాత్ర✍