మగవాడి మెదడు ఏమాలోచిస్తుంది

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

మగవాడి మెదడు ఏమాలోచిస్తుంది

శుక్ర, 20/04/2018 - 08:50
0 comments

పసితనాన్ని సైతo
ఆడతనం తో మిళితం చేసి

వారాలు నెలలు కలుపుకొని 
సుప్రీం కోర్టులు తీర్పులిస్తుంటే

మహిళా మీనా మేషాలు లెక్కిస్తూ 
సలహాలు సూచనలు కాదు 
నీవు తీసుకోవాల్సింది

మగవాడి మెదడు ఏమాలోచిస్తుంది అని 
తూచి తూకం వేసి 
కాటాలో కొలిచి

కసి ఆలోచనలకూ పదును పెట్టు 
నీడని సైతం నిద్ర పోనీకు

ఉనికి ఉండాలంటే యుద్ధం తప్పదు 
నీతో నీకు పోరు తప్పదు