నా దేశంలో అవినీతి పరుడు ఏవ్వడు..దేశ ద్రోహి ఎవడు

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

నా దేశంలో అవినీతి పరుడు ఏవ్వడు..దేశ ద్రోహి ఎవడు

ఆది, 06/05/2018 - 08:21
1 comment

✍నా దేశంలో అవినీతి పరుడు ఎవ్వరు?దేశ ద్రోహి ఎవడు..?

✍తల్లి పాలు త్రాగి రుణం తీర్చు కోవాలి అంటారు మరి తల్లీ భరత మాత రుణం ఎలా తీర్చు కుంటున్నామో తెలుసా..?

✍నేను రాజకీయ నాయకులు, అధికారులు అవినీతి చేస్తున్నారు అనుకునే వాడిని కుండలో నీరు పోస్తే ఏమిటి సుఖం కుండకు ఉన్న రంద్రం ద్వారా నీరు పోతుంది అలా ప్రజలు డబ్బు తీసుకుని ఓటు వేసినంత కాలం ఉట పోయిన కుండలో నీరు ఎలా ఉండదో ఓటుకు మందు ,నోటు తీసుకున్నంత కాలం దేశం అభివృద్ధి జరగదు.

✍నేను ఒక సాధారణ మనిషిని బస్సు లో టిక్కెట్ పెరిగినా ఇంటి పన్ను పెరిగినా ప్రభుత్వ అధికారి నాపని చేయక పోయినా బాధపడి అసహనంతో రెండు తిట్లు తిట్టుకుంటూ నేను నిజాయతీగా ఉన్నాను దేశంలో అందరూ ద్రోహులే అనుకున్నాను అస్సలు కుండకు చిల్లు నేనే అని గ్రహించ లేదు.

✍ఓటు అంటే కోటర్ మందు,మాంసం ముక్క,1000 నోటు అబ్బా అని సంబర పడ్డాను భళి భళి అని ముక్క నోటికి తీసుకుని పెగ్గు మందు వేసి నోటు తో 2 రోజులు విందు చేసి డబ్బుకు ఓటును తెగనమ్ముకున్నా.

✍3 రోజూ బస్సు ఎక్కా టిక్కట్ రెండు రూపాయలు పెరిగింది 5 ఏళ్ళు ఇంకెంత పెరుగుతుందో తెలీదు ఇంటి పన్ను,కరెంట్ బిల్లు,పన్నులు నిత్యావసరాలు అన్ని రూపాయికి రూపాయి పెరిగాయి ప్రభుత్వం తీరు సరిగా లేదు అని తిట్టుకున్న.

✍నేను తీసుకున్న 1000 నోటు రోజుకు రూ2.50 పైసలు బిక్షం వేసి నా నెత్తిన రోజుకు 100 రూపాయలు పెంచారు. అందుకే ఓటు నేను అమ్ముకున్న దేశ ద్రోహిని నేనే .

✍ప్రాజెక్టులు కట్టాలి అంటే 100 కోట్లతో అయ్యేది 10000 కోట్లు కావాలి అంటే 100 కోట్లు అయ్యితే ఒక్క ఏడాది లో ఇవ్వచ్చు కట్ట గళం కూడా 10000 కోట్లు అంటే 5 ఏళ్ళు దేశ ఆదాయంలో కొంచెం కొంచెం తీసుకోవాలి ఇలా ఒక్క ప్రాజెక్ట్ ఆగితే వేల ఎకరాలు కు నీరు రాదు రోడ్డు ప్రాజెక్ట్ అయ్యితే రోడ్డు రాదు.ఎందుకు అంటే 5 ఏళ్లకు వచ్చే పండక్కు భిక్ష గాళ్లకు బిక్షం వేయాలి కదా అందుకే ఆ డబ్బు అంతా మూట కట్టి ఉంచి కొంచెం వాళ్ళకి మరి కొంచెం ఓటుకు నోటుకు.

✍చూసారా ఒక సంవత్సరం లో అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఎవ్వరు అడ్డుకున్నారు దేశ శ్రేయస్సు ఎవ్వరు తగల బెడుతున్నారు.

✍ఏ అధికారి అయ్యినా తమకు కోరిన చోట స్థాన చలనం కోరిన ప్రమోషన్ రావాలి వాళ్ళు రాజకీయ నాయకులకు ముడుపులు కట్టాలి డ్యూటీ చేసి అవినీతి తో పెట్టిన పెట్టుబడి రాబట్టాలి డబ్బు ఇవ్వకుంటే వాళ్ళ కు మంచి కొలువు రాదు లంచం తీసుకోకుంటే పనులు అవ్వవు.

✍అందుకే సామాన్యుడు బలి అవ్వుతున్నారు డబ్బు ఉన్నవాడు లంచాలు ఇచ్చు కుంటూ పనులు చేయించుకుంటున్నాడు.పేదల భూములు లాక్కుని భూ కబ్జాలు చేసినా ఏ అధికారి స్పదించడు .చెని పోయినా వారు కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అంట .

✍పాపం అధికారులు లంచాలు రాజకీయ నాయకులకు ఇస్తారు రాజకీయ నాయకులు ఓటుకు డబ్బు ఇస్తారు ఇంతే కదా

✍అంటే ఒక లంచ గొండి అవినీతి పరుడు దేశంలో ఎవ్వరు తయారు చేస్తున్నారు నేను కాదా నేను ఓటుకు డబ్బు తీసుకున్నాను కదా

✍ఎక్కడ 4 కనిపించిన ప్రభుత్వం సరిగా పనిచేయటం లేదు ఇదే గోల ప్రభుత్వం అంటే ప్రజలే కదా ఎవ్వరు మారాలి ఎవ్వరు దేశ ద్రోహి ఎవ్వడు అవినీతి పరుడు ఆలో చించండి

✍స్కూల్లో జనగన మన పాడించడం నేర్పడం కాదు ఓటు ఎంత గొప్పదో అది అమ్ముకోవడం వలన దేశం ఎంత వెనక బడుతుందో చెప్పాలి.

✍భారత దేశం అభివృద్ధి చేందుతున్న దేశం ఎప్పుడు ఇది సువర్ణ అక్షరాలు అభివృద్ధి ఎప్పటికి చెందదు .జపాన్ ఎన్ని దెబ్బలు తిన్నా ఓడల్లో వ్యవసాయం చేసినా అభివృద్ధి చెందిన దేశం అయ్యింది.

✍మనకు నదులు భూములు సహజ వనరులు అన్ని ఉన్నా కూడా అభివృద్ధి చెందడం లేదు.మార్పు మనలో రావాలి నాయకుల్లో కాదు మొదట నేను మారాలి తల్లి ని వ్యభిచారం చేసి బ్రతికినట్టు తల్లి లాంటి ఓటు ను అమ్ముకోవడం మనాలి ఈరోజే మార్పుకు శ్రీ కారం చుట్టాలి నా దేశం కోసం .క్రికెట్ ఓడి పోతే దేశం ఒడినట్టు కాదు టీవీల్లో దేశాన్ని గెలిపించే దేశ వీరాభిమానులారా ఓటు విలువ నీ కుటుంబానికి సమాజానికి చెప్పి5 ఏళ్ళు కు ఒక్కసారి వచ్చే మ్యాచ్ ను గెలిపించి దేశాన్ని అభివృద్ధి దేశం గా మార్చండి. *

✍జయహో భారత్ మహాన్

Comments