సంఘంలో త్వరతగతిన మార్పు రావాలంటే విద్య ద్వారానే సాధ్యపడును

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

సంఘంలో త్వరతగతిన మార్పు రావాలంటే విద్య ద్వారానే సాధ్యపడును

ఆది, 15/04/2018 - 10:52
0 comments

మానవుని అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానజ్యోతులు వెలిగించేది విద్య. 


 "విద్యలేనివాడు వింత పశువు" అనేది  లోకోక్తి.

అలాంటి విద్య భారతదేశంలో ఒకప్పుడు స్రీలకు శూద్రులకు నిషిద్ధం


స్త్రీలను సమాజానికి బానిసలుగా అంధ విశ్వాసాలకు మూఢాచారాలకు నిలయంగా తయారు చేసి తాము పెత్తనం చేయాలని కొందరు అనుకునేవారు. సంఘంలో త్వరతగతిన మార్పు రావాలంటే విద్య ద్వారానే సాధ్యపడును. 
విద్య వివేకాన్ని ,ఆత్మ గౌరవాన్ని ఇస్తుంది.


అందుకే ముందుగా స్త్రీలు శూద్రులు విద్యావంతులు కావాలి.
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు మరియు దేశసౌభాగ్యం.
 
నాడు  దేశంలో  శుద్రులకు చదువు  లేక  పోవడం  వలన  

  • విద్య లేక మతి (వివేకం) తగ్గింది 
  • మతి లేక నీతి తగ్గింది 
  • నీతి లేక పురోగతి తగ్గింది 
  • పురోగతి లేక విత్తం (సంపద)  తగ్గింది
  • విత్తం  లేక సూద్రులు   నాశనమయ్యారు.

ఇంత అనర్ధము  ఒక్క  విద్య వలెనే.