TRS మానిఫెస్టోలో వడ్డెర్ల ST డిమాండ్ చేర్చాలి

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

TRS మానిఫెస్టోలో వడ్డెర్ల ST డిమాండ్ చేర్చాలి

శుక్ర, 14/09/2018 - 08:45

హైదరాబాద్,

September 2018.

To,

శ్రీ K. చంద్రశేఖర్ రావు గారు,

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రెసిడెంట్,

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం,

హైదరాబాద్,

తెలంగాణ రాష్ట్రం                                                                   

From,

తెలంగాణ రాష్ట్ర వడ్డెరలు

గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రెసిడెంట్ గారికి,

విషయంపూర్తిగా వెనకబడ్డ శ్రామిక మరియు సంచార వడ్డెరల న్యాయమైన, 43 ఏళ్ల, ST డిమాండ్ను TRS మానిఫెస్టోలో చేర్చి, లక్షల వడ్డెర్లు మీ పార్టీ పై ఉంచిన విస్వాస రుణాన్ని తీర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము

 

అయ్యా,

వడ్డెర మరియు వివిధ పేర్లతో, భరత ఖండం అంతా విస్తరించియున్న మేము, దేశంలోని కట్టాడాలన్నీమా రక్తం మరియు చెమటతో నిర్మించిన, అతి పెద్ద సంచార, నిర్మాణ శ్రామిక తెగలము.

బ్రిటిష్ పాలనలో, మమ్ములను, నేర జాతులుగా(క్రిమినల్ ట్రైబ్స్) ముద్రించడం వల్ల, క్రమంగా, సాంఘిక దోపిడీకి గురికాబడ్డాము. ఇలాంటి తెగలకు, స్వతంత్రానంతరం, 1952 లో DNT లుగా పేరు మార్చినప్పటికీ, చెప్పుకోదగ్గ చేయూత లభించక, మేము, అన్ని రంగాల్లో వెనకబడిపోయాము.

1976 SC/ST యాక్టు ద్వారా, చాలా రాష్ట్రాల్లో వడ్డెరలు, SC/ST లుగా గుర్తింపు పొందారు. ఇదే 1976 SC/ST యాక్టు, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని DNT లను ST లు గా గుర్తించి, మా వడ్డెర్లను మాత్రం విస్మరించడంతో, BC లుగానే మిగిలిపోయాము. 1976 నుండి, మా తెలుగు వడ్డెర్లు, ST కోసం పోరాడుతూనే ఉన్నారు.

కులం లో లేనటువంటి, శారీరక హింస మరియు ప్రాణాపాయ  ప్రమాదాలతో కూడిన వృత్తి లో ఉన్న మా వడ్డెరలకు, BC లో అందించే చేయూత చాలక, వృత్తి సంబంధిత సాంఘిక సమస్యల ఊబిలో చిక్కుకు పోతున్నాము. విద్య, ఆర్ధిక, ఉపాధి మరియు రాజకీయ రంగాల్లో వెనకబడ్డ మేము, చెప్పుకునే దిక్కులేక పోవడం వల్ల, సంఘంలో దాడులకు కూడా గురి అవుతున్నాము.

తెలంగాణ పోరాటం లో, లక్షల వడ్డెర్ల పాత్ర, ముఖ్యంగా  ఉస్మానియా పక్కనే ఉన్న, మానికేశ్వర్ వడ్డెర బస్తీ వడ్డెర్లు పోషించిన పాత్ర మీకు తెలియంది కాదు. 2014 లో, వడ్డెర్లు TRS కు పట్టం కట్టడం లో ముఖ్య పాత్ర పోషించారు.

మీ పార్టీ పై ఉంచిన నమ్మకముతోనే, మేము మా వడ్డెర్ల ST డిమాండును మన 2018-19 ఎన్నికల, TRS మానిఫెస్టోలో, చేర్చవలసిందిగా అభ్యర్ధిస్తున్నాము

మా బ్రతుకులు బాగు పడాలంటే, నిర్దిష్ట వనరులు సమకూర్చి, మెరుగైన విద్య, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్ తో పాటు, మాకు అట్రాసిటీ చట్ట రక్షణ కూడా ఇవ్వగల మరియు మేము న్యాయంగా ఉండవలసిన ST జాబితాలో మమ్ములను చేర్చే విధంగా, మా 43 ఏళ్ల, ST డిమాండ్ను TRS మానిఫెస్టోలో చేర్చి, లక్షల వడ్డెర్లు, మీ పార్టీ పై ఉంచిన విస్వాస రుణాన్ని తీర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

ధన్యవాదములతో,

ఇట్లు,

తెలంగాణ రాష్ట్ర వడ్డెరలు

 

Note: పేరు, ఫోన్ నంబర్ మరియు సంతకాలతో కూడిన పత్రాలను విజ్ఞప్తికి జత చేస్తున్నాము.