విజయనగరం కలెక్టరు గారికి

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

విజయనగరం కలెక్టరు గారికి

గురు, 12/07/2018 - 18:22

విజయనగరం,

16th July 2018.

To,

కలెక్టరు గారు,

విజయనగరం జిల్లా కలెక్టరు కర్యాలయం,

విజయనగరం,

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం.                                                                 

From,

విజయనగరం జిల్లా వడ్డెరలు.

 

గౌరవనీయులైన విజయనగరం కలెక్టరు గారికి,

 

విషయంవడ్డెర్ల సుదీర్ఘ ST సాధన, న్యాయపోరాటం పై, సానుకూలంగా స్పందించిన AP ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, మూడు మాసాల్లో కమీషన్ మరియు అసెంబ్లీ తీర్మాన ప్రక్రియను పూర్తి చేసి, పార్లమెంటు లో బిల్లు దిశగా వత్తిడి తేవాలని విజయనగరం జిల్లా వడ్డెర్లము విజ్ఞప్తి చేస్తున్నాము

 

మేడం/సర్,

వడ్డెర మరియు వివిధ పేర్లతో, భరతఖండం అంతా విస్తరించియున్న మేము, దేశంలోని కట్టాడాలన్నీమా రక్తం మరియు చెమటతో నిర్మించిన, అతి పెద్దసంచార, నిర్మాణ, శ్రామిక తెగలము.

బ్రిటిష్ పాలనలో, మమ్ములను, నేరజాతులుగా(క్రిమినల్ ట్రైబ్స్) ముద్రించడం వల్ల, క్రమంగా, సాంఘికదోపిడీకి గురికాబడ్డాము. ఇలాంటి తెగలకు, స్వతంత్రానంతరం, 1952 లో DNT లుగా పేరు మార్చినప్పటికీ, చెప్పుకోదగ్గ చేయూత లభించక, మేము, అన్ని రంగాల్లో వెనకబడిపోయాము.

1976 SC/ST యాక్టు, చాలా రాష్ట్రాల్లో వడ్డెర సంబంధిత కులాలను SC/ST లుగా గుర్తించి, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని, మా సహచర DNT లను కూడా ST లు గా గుర్తించి, మా వడ్డెర్లను మాత్రం, విస్మరించడంతో, BC లుగానే మిగిలిపోయాము.

కులం లో లేనటువంటి, శారీరక హింస మరియు ప్రాణాపాయ  ప్రమాదాలతో కూడిన వృత్తి లో ఉన్న మా వడ్డెరలకు, BC లో అందించే చేయూత చాలక, వృత్తిసంబంధిత సాంఘిక సమస్యల, ఊబిలో చిక్కుకు పోతున్నాము. విద్య, ఆర్ధిక, ఉపాధి మరియు రాజకీయ రంగాల్లోవెనకబడ్డ మేము, చెప్పుకునే దిక్కులేకపోవడం వల్ల, సంఘంలో, దాడులకు కూడా గురి కాబడుతున్నాము.

మా బ్రతుకులు బాగు పడాలంటే, నిర్దిష్టవనరులు సమకూర్చి, మెరుగైన విద్య, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్ తో పాటు, మాకు అట్రాసిటీ చట్ట రక్షణ కూడా ఇవ్వగల మరియు మేము న్యాయంగా ఉండవలసిన ST జాబితాలో చేర్చే, పూర్తి రాజ్యాంగ ప్రక్రియను, మూడు మాసాల్లో పూర్తి చేయాలని విజయనగరం జిల్లా వడ్డెరులం, సవినయంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాము.

ధన్యవాదములతో,

ఇట్లు,

 

విజయనగరం జిల్లా వడ్డెరలు

NOTE: విజయనగరం జిల్లా వడ్డెరల పేర్లు, ఫోన్ నంబర్లు మరియు సంతకాలతో కూడిన పత్రాలను విజ్ఞప్తికి జత చేస్తున్నాము