AP లో వడ్డెరలను ఎస్టీ లో చేర్చాలని ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

AP లో వడ్డెరలను ఎస్టీ లో చేర్చాలని ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు

బుధ, 20/06/2018 - 06:34
0 comments

ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా వివిధ సామాజిక వర్గాల డిమాండ్లపై ఒక కమిషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎస్టీల్లో చేర్చాలని వడ్డెర, మత్స్యకారులు..... ఎస్సీల్లో చేర్చాలని రజకులు, నాయీ బ్రాహ్మణులు... ఇలా వివిధ సామాజిక వర్గాల నుంచి పెద్దఎత్తున డిమాండ్లు రావడంతో.... ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఆయా సామాజికవర్గాల డిమాండ్లపై అధ్యయనం జరపనున్న కమిషన్‌... కేంద్రానికి పంపే విధంగా నివేదికలు ఇవ్వనుంది.