నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోని కోస్లీ పంచాయతీ పరిధిలోని వడ్డెర కాలనీ వాసుల దుస్థితి

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోని కోస్లీ పంచాయతీ పరిధిలోని వడ్డెర కాలనీ వాసుల దుస్థితి

శని, 16/06/2018 - 06:22
0 comments

ఆ కాలనీలో నివసించే వా రిలో ఎక్కువ భాగం పొట్ట కూటీ కోసం కంకర రాయి కొట్టుకుని జీవించే వడ్డెర కులస్థులు. రోజంతా కష్టప డి రాళ్లు కొడితినే ముద్ద నోట్లోకి వస్తుంది. దీనికి తో డు వారు నివసిస్తున్న ఇళ్లు అగ్గిపెట్టె సైజును పోలివు న్నాయి. వీటిపైన ఉన్న రేకులు ఎప్పుడు గాలికి ఎగిరి పోతాయో తెలియదు. రేకులు గాలికి ఎగిరిపోకుండా పైన పెద్ద బండరాళ్లను ఉంచారు. ఎక్కువ వేగంగా గాలివీస్తే బండరాళ్లు కిందపడి ప్రమాదం జరిగే అవ కాశం ఉందని తెలిసి కూడా తప్పని పరిస్థితిలో ఈ ఏ ర్పాటును చేసుకున్నారు. ఇంటిలోపల కనీసం కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకోవడానికి కూడా స్థలం అ నువుగా లేకపోవడంతో ఆరుబయనే వంట చేసుకుంటున్నారు.

 

వర్షకాలంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరితే ఆరోజు రాత్రంతా జాగారం చేయవలసిందే. వారు ని వశిస్తున్న చాలా ఇళ్లకు కనీసం తలుపులు కూడా లేవంటే వారు ఎంత దుర్భర పరిస్థితిలో జీవిస్తున్నారో అర్థమవుతో.ది. వర్షకాలంలో రోజంత వర్షం కురిస్తే క నీసం వంట చేసుకోవడానికి కూడా అవకాశం లేక అర్థాకలిలతో పూట గడపాల్సిందే. ఎక్కువ మంది ఉ న్న కుటుంబాలలో రాత్రిపూట కనీసం కాలు చాపుకొ ని పడుకునే స్థలం లేని నిస్సహాయ స్థితిలో ఈ కు టుంబాలు ఉన్న గ్రామం కాదు నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోని కోస్లీ పంచాయతీ పరిధిలోని వడ్డెర కాలనీ వాసుల దుస్థితి. ఈ కాలనీలో సుమా రు 70కుటుంబాలు ఉండగా 350వరకు జనాభా ఉం టుంది. ఇందులో అధిక భాగం కంకర రాయి కొట్ట ప నులు నిర్వహిస్తుండగా మరికొంత మంది కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు.

 

తరాలు మారిన తమ బతుకులు మారటం లేదని తమ సంక్షేమం గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్డెర కాలనీలో 40వేల లీ టర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకు ఉండగా గత 4సం వత్సరాలుగా ఈ ట్యాంకు వృథాగా ఉంది. కాలనీలో ఉన్న సింగిల్‌ ఫేజ్‌ బోరు బావిలో భూగర్భ జలాలు అడుగంటాయి. అలాగే కాలనీలో సరియైన రోడ్డు, మురికి కాలువలు లేవు. ఇప్పటికైనా ఉన్నతాధికారు లు స్పందించి అర్హులైన వారందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అలాగే వడ్డెర కాలనీలో మౌళిక సదుపాయల కల్పనకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు