రాజమండ్రి లొ వడ్డెర్లకు YSR ఇచ్చిన ST హమీని జగన్ కు గుర్తు చేసిన వడ్డెర్లు

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

రాజమండ్రి లొ వడ్డెర్లకు YSR ఇచ్చిన ST హమీని జగన్ కు గుర్తు చేసిన వడ్డెర్లు

గురు, 14/06/2018 - 06:51
0 comments

‘వడ్డెర్లను ఎస్టీల్లో చేరుస్తానని వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చారు. కానీ చేర్చలేదు. ఆయన ప్రభుత్వం వచ్చినా నెరవేరలేదు. మీరైనా దీనిని పరిశీలించండి’ అని వడ్డెర్ల సంఘం నాయకులు వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను కోరారు.

తప్పకుండా పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

జగన్‌ పాదయాత్ర బుధవారం రాజమహేంద్రవరం ఐఎల్‌టీడీ జంక్షన్‌ నుంచి మొదలైంది. శంభూనగర్‌, ధవళేశ్వరం వరకు నడిచారు. అక్కడ భోజనం తర్వాత మళ్లీ పాదయాత్ర కొనసాగించారరు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ మీదుగా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని బొబ్బర్లంక నుంచి పేరవరం చేరింది. అక్కడే ఆయన రాత్రి బస చేశారు. బుధవారం ఎక్కడా బహిరంగ సభలు జరపలేదు.