ST నినాదంతో నెల్లూరు లో వడ్డెర గర్జన సభ

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

ST నినాదంతో నెల్లూరు లో వడ్డెర గర్జన సభ

మంగళ, 01/05/2018 - 16:23
0 comments
ST నినాదంతో.నెల్లూరు గర్జన సభ మే 13 న VR కాలేజ్ గ్రౌండ్ లో జరుగును ఒకప్పుడు రాజులమని చరిత్ర చెబుతోంది. నేడు అభివృద్ది కి ఆమడ దూరంలో వున్నాము. ఈ వాట్సాప్ పుణ్యమా అని ఎక్కడెక్కడో వున్న వారిని ఒక్కటి చేసింది. అయితే భౌతికంగా మనం అందరం ఒకచోట కలవలేదు. అందరినీ ఏకం చేస్తూ బెల్లంకొండ శ్రీనివాసులు గారు నెల్లూరు జిల్లాలో భారీ బహిరంగ సభ ను ఏర్పాటు చేశారు. రాష్ట్రం లో ని వాట్సాప్ గ్రూపు లో వున్న వారు మరియు మీ సన్నిహితులను రాష్ట్ర నలుమూలల నుండి తీసుకుని సభకు రాగలిగితే మన వడ్డెర ల సత్తా ఏమిటో ప్రభుత్వం నకు తెలుస్తుంది. మన హక్కులు నెరవేరుతాయి. సమయం వచ్చింది. ప్రతి ఒక్కరూ మీరు రావడమే కాకుండా ఇద్దరిని తీసుకుని రండి. సభ విజయవంతం అవుతుంది. ప్రభుత్వం గుర్తిస్తుంది.మన నాయకులకు పదవులు వస్తాయి. కావున అందరూ మే 13 వ తేదీ బహిరంగ సభకు వచ్చి విజయవంతం చేస్తారనుకుంటున్నాము