వడ్డెరలను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని సీఎం నిర్ణయించడం పట్ల నాయకుల కృతజ్ఞతలు

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

వడ్డెరలను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని సీఎం నిర్ణయించడం పట్ల నాయకుల కృతజ్ఞతలు

బుధ, 20/06/2018 - 06:18
0 comments

డ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు, రజకులను ఎస్సీల్లో చేర్చేందుకు కృషి చేయడంతోపాటు వారికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం చంద్రబాబుకు మత్స్యకార, వడ్డెర, రజక సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్యతోపాటు వడ్డెర, రజక సంఘాల నాయకులు బుధవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో సీఎం చంద్రబాబును కలిశారు. రజక, వడ్డెర, మత్స్యకారుల జీవన విధానాన్ని అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల 1.44 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని మత్స్యకార నేతలు అన్నారు.

 

వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా.. టీడీపీ ఆవిర్భావం నుంచి రజకులకు అండగా నిలిచిందని రజక సంఘం నేతలు చెప్పారు. వాషర్‌మెన్‌ ఫెడరేషన్‌కు రూ. 100 కోట్లు కేటాయించేలా నిర్ణయం తీసుకున్న చంద్రబాబుకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 23 లక్షల మంది రజకులు ఇంటింటికీ తిరిగి 2019 ఎన్నికల్లో టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని ఫెడరేషన్‌, జేఏసీ సంయుక్తంగా తెలిపాయి. అలాగే వడ్డెరలను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని సీఎం నిర్ణయించడం పట్ల రాష్ట్ర, జిల్లాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.