రఘునాథ నోట వడ్డెర్లకు ST మాట

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

రఘునాథ నోట వడ్డెర్లకు ST మాట

శని, 07/04/2018 - 17:54
0 comments
వడ్డెర్ల సమస్యల పై ఈరోజు అసెంబ్లీలో గళం విప్పిన ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి... వడ్డేర్లను ఎస్టి జాబితాలోకి చేర్చాలని కోరిన ప్రభుత్వచీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి వడ్డెర్లకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరిన ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి రాష్ట్రంలో 30 లక్షల జనాభా ఉన్న వడ్డెర్లకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన ఈరోజు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు వడ్డెర్లకు ఎమ్మెల్సీ పదవి, ఎస్టి జాబితాలోకి చేర్చుతామని ఇచ్చిన హామీ పరిశీలించి వడ్డెర్లకు తగున్యాయం చేయాలని కోరారు.వడ్డెర్ల ఫెడరేషన్ రూ.100 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం రుణ యూనిట్లు, ఆదరణ యూనిట్లు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అసెంబ్లీలో ప్రభుత్వానికి విన్నవించారు.. ఏమ్మెల్సీ ఎంపిక సమయంలో, నోరెందుకు మెదపలేదో! బడ్జెట్ సమావేశాలు చివరి రోజున మాత్రమే వడ్డెర్లుఎలా గుర్తొచ్చారో! ఈ ముసలి కన్నీరు ఎందుకో ? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఉంది ఇప్పటికైనా వడ్డేర్ల గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు.