వడ్డెర వెలుగు చారిటబుల్ ట్రస్ట్

వడ్డెర వెలుగు చారిటబుల్ ట్రస్ట్

Profile picture for user editor
కులం అందలమెక్కాలి అంటారు ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యరు ? ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అంటారు ఆపన్నహస్తాలు అందివ్వరు ? పేదరిక నిర్మూలన జరగాలి అంటారు కానీ జాతికి దూరంగా ఉంటారు ?చైతన్యం రావాలి అంటారు కానీ చేయూత ఇవ్వరు ? ఇలాంటి జవాబు లేని ప్రశ్నలు ఎన్నో. తల్లి తండ్రి చదువుకు నోచుకోక పేదరికంలో మగ్గుతూ తాతలు తండ్రులు ఖష్టాన్ని నమ్ముకొని కాలం వెల్లదీసారు. మేము అలాగే బ్రతుకుతున్నాము మనకు ఎందుకు చదువులు అంటూ నేటికీ తమ పిల్లల్ని కొన్ని ప్రాంతాలలో కొంతమంది చిన్న వయసులోనే బాల కార్మికులుగా మారుస్తున్నారు. ఇప్పటికీ రెక్కల ఖష్టాన్నే నమ్ముకొని ఆడా మగా అని తేడాలేకుండా చెమటోడ్చి జీవనం కొనసాగిస్తున్న నా సోదరి సోదరలు పొట్టకూటి కోసం కూలి పనులకు వెళితే విధి వక్రీకరించి ప్రమాదాల బారిన పడుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోవడం సోషియల్ మీడియాలో అనేకం చూసాను .ఆవేదన చెందాను గాలి పీల్చుకుంటే ఆకలి తీరదు అనేది ఎంత సత్యమో.ఉచిత సలహాలు ఊకదంపుడు ఉపన్యాసాలు అలాంటివే అని భావించి .అన్వేషించగా కొంతమంది సహకారం సంకల్పంగా చేసుకొని లక్షమంది కార్మికులకు ఉచితంగా ఇన్సూరెన్స్ లు చేపించడమే లక్ష్యంగా వడ్డెర వెలుగు చారిటబుల్ ట్రస్ట్ కు శ్రీ కారం చుట్టాము. ఆరంభం మేము చేసినా ఆశయాలు మన అందరివీ కావాలి వడ్డెర జాతి బిడ్డలగా తోటి కులస్తులకు చేతనైన చెయ్యగలిగిన సహకారం చేయూతను అందిద్దాం కొంత మంది జీవితాలలోనైనా వెలుగులు పూయిద్దాం నావంతు నా జాతికి సహకరించానని సంతోష పడదాం ఆదర్శాలకు ఆయువు పోద్దాం..........................🙏
రిజిష్ట్రేషన్ నంబర్
9/2017
రిజిష్ట్రేషన్ తేది
సంప్రదించవలసిన పేరు
Kunchala Sudhakar